Pooja Formalities Completed For AAA Cinemas: హైదరాబాద్‌లో, ప్రత్యేకంగా అమీర్ పేట్‌తో అనుబంధం ఉన్న వారికి సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా గుర్తు కూడా చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్రదేశంలో ఏషియన్ సత్యం మాల్ సిద్ధమైంది. అల్లు అర్జున్ ఏషియన్ సంస్థలతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ మల్టీ [ప్లెక్స్ స్క్రీన్లను కూడా సిద్ధం చేశారు. ఈ థియేటర్ జూన్ 15వ తేదీన ప్రారంభం కానుండగా ఈరోజు పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
Also Read: Adipurush Tickets: పీపుల్స్ మీడియా నిర్మాతలకు మెంటలెక్కిస్తున్నారట!
రేపు ఈ థియేటర్‌ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఏషియన్ సత్యం మాల్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ లు కాకుండా మురళీ మోహన్, సదానంద గౌడ్లు భాగస్వాములుగా ఉండనున్నారు. మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్‌లో మూడు ఫ్లోర్ల పార్కింగ్ తో పాటు మూడో ఫ్లోర్‌లో ఏఏఏ ఫుడ్ కోర్ట్ ఉండనుంది.. ఇక ఏఏఏ సినిమాస్ నాలుగో ఫ్లోర్‌లో ఉండనుండగా అందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నాయి.
Also Read: Rajamouli: ‘జక్కన్న’తో అమిత్ షా మీటింగ్ ఎందుకబ్బా?
వీటిలో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తుతో బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లుతో ఉండనుంది. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ అట్మాస్ సౌండ్‌తో రానుంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్‌తో ఉండనుండగా అదనంగా డాల్బీ 7.1 సౌండ్ కూడా ఉండనుంది. అయితే స్క్రీన్ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి LED స్క్రీన్‌ను కలిగి ఉందని ఇది భారతదేశంలో నాల్గవ LED స్క్రీన్ తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ & బెంగళూరులో ఇప్పటివరకు LED స్క్రీన్స్ ఉండగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆ స్క్రీన్ ఏర్పాటు కానుంది. ఇక ఇక్కడ ప్రొజెక్షన్ ఉండదని, కేవలం కనెక్షన్ ఇస్తే చాలని తెలుస్తోంది. ఇక ఈ థియేటర్లోని అన్ని స్క్రీన్స్ జూన్ 16న #ఆదిపురుష్ కోసం సిద్ధమవుతున్నాయి.
