ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు తెచ్చుకున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న ఈ సీరీస్ లో ఫస్ట్ పార్ట్ ‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్ వీక్ గా చెయ్యడంతో ఇతర భాషల సినీ అభిమానులకి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 పెద్దగా రీచ్ కాలేదు. పైగా సినిమాలో తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ కూడా వినిపించడంతో, ఇది తమిళ వాళ్ల కోసం మాత్రమే తీసిన సినిమానేమో అనుకున్నారు. నిజానికి పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళ రాజుల కథ, అందుకే సినిమాలో తమిళ నేటివిటి ఉంటుంది. రీచ్ పెరగడం కోసం మణిరత్నం ఒరిజినల్ కథలో మార్పులు చేస్తే అది చరిత్రకే ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని చాలా మంది సినీ అభిమానులు అర్ధం చేసుకోలేకపోయారు అనేది వాస్తవం.
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని తెలుగు ప్రేక్షకులు కావాలని తక్కువ చేసి చూస్తున్నారు అంటూ కోలీవుడ్ సినీ క్రిటిక్స్ బాహాటంగానే విమర్శించారు. మీ సినిమాలు తమిళనాడులో రిలీజ్ అయినప్పుడు మేము కూడా ఇలానే రియాక్ట్ అవుతాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే యూనివర్సల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఉన్నా దాన్ని కన్వే చెయ్యడంలోనే మేకర్స్ ఫెయిల్ అయ్యారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2కి ఈ తప్పు జరగకూడదు అంటే హై ఎండ్ ప్రమోషన్స్ జరగాలి. ఈ విషయం అర్ధం చేసుకున్న ‘లైకా ప్రొడక్షన్స్’ పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. సగానికి పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సెకండ్ పార్ట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయంలో… రేపు సాయంత్రం నాలుగు గంటలకి పొన్నియిన్ సెల్వన్ అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారా? లేక ట్రైలర్ అప్డేట్ ఇస్తారా? లేక న్యూ ఇయర్ కి పోస్టర్ రిలీజ్ చేస్తారా? అనే విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Something special is on the horizon. Can you guess what?#PS #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @PrimeVideoIN pic.twitter.com/JCOSL4ISgW
— Lyca Productions (@LycaProductions) December 27, 2022