Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ తంబీలకు బొద్దుభామలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో నమితకు గుడి కట్టేసి.. దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఇక అన్ని భాషల్లో నమిత తన సత్తా చాటుతున్న తరుణంలోనే తెలుగు, తమిళ్ నటుడు వీరేంద్ర చౌదరి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం నమిత పిల్లలను చూసుకొనే బాధ్యత తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరేంద్ర.. బిజినెస్ లో బిజీగా మారాడు.
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక ఈ నేపథ్యంలోనే వీరేంద్రపై ఒక చీటింగ్ కేసు నమోదయ్యింది. తన వద్ద రూ. 41 లక్షలు తీసుకొని తనను మోసం చేసారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. వీరేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (MSME)కు ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు సులభంగా రుణాలను అందిస్తుంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుంటుంది. MSME అలాంటి వారికి లోన్స్ ఇప్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వమే దీనిని నడిపిస్తూ ఉంటుంది. ఇక గోపాలస్వామి అనే వ్యక్తి దగ్గర ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు.వారితో పాటు వీరేంద్రకు కూడా భాగం ఉందన్న అనుమానంతో.. ఆయనను విచారించడానికి వీరేంద్రకు నోటీసులు పంపారు. అయితే ఇప్పటివరకు వీరేంద్ర ఎక్కడ ఉన్నాడు అనేది తెలియరాలేదు. మరి ఇందులో అతని హస్తం ఉందా లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!