Site icon NTV Telugu

మణిరత్నంపై కేసు నమోదు

Police Case Filed Against Director Manirathnam

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్‌లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు నమోదు చేశారు. గుర్రం అలసట, డిహైడ్రేట్ కు గురయ్యిందని, అయినప్పటికీ దానిని షూటింగ్ లో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని పెటా ఇండియా ఆరోపించింది. నిజమైన జంతువులను ఉపయోగించకుండా, కంప్యూటర్ గ్రాఫిక్‌లను వాడాలని అందరూ చిత్రనిర్మాతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని పెటా ఇండియా అన్ని జంతు సంక్షేమ బోర్డులను అభ్యర్థించింది. మరి ఈ కేసుపై మణిరత్నం ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also : డబ్బింగ్ స్టార్ట్ చేసిన “ఎనిమీ”

దివంగత రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన “పొన్నియిన్ సెల్వన్” నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” అనే ఒకే చిత్రాన్ని రెండు భాగాలుగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్, లాల్, రహమాన్ నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ని శ్రీకర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version