డబ్బింగ్ స్టార్ట్ చేసిన “ఎనిమీ”

తమిళ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” చిత్రం. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో విశాల్, ఆర్య , మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విశాల్ కూడా ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ గా సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా విశాల్ ఈ సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also : 40 ఏళ్ళ ’47 రోజులు’

కాగా ఆగస్టు 29న ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఆ మూవీని తెలుగులో “సామాన్యుడు”, నాట్ ఏ కామన్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇక విశాల్ తన పుట్టినరోజును అనాథ శరణాలయంలో మరింత ప్రత్యేకంగా జరుపుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-