Site icon NTV Telugu

Cheating Case: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అతని తండ్రిపై కేసు నమోదు.. నమ్మించి మోసం చేశారంటూ

bellamkonda srinivas

bellamkonda srinivas

చిత్ర పరిశ్రమ అన్నాకా నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పై ఒక ఫైనాన్షియర్ పోలీస్ కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం నిర్మాత బెల్లంకొండ సురేష్ పైనే కాకుండా ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైన కూడా కేసు పెట్టడం గమనార్హం..

వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సురేష్.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వద్ద కొత్త సినిమా కోసం 2018-19 మధ్యలో 50 లక్షలు తీసుకున్నాడని, తరువాత గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నామని మరికొంత డబ్బు తీసుకున్నారని శ్రవణ్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఆ తరువాత సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో తన డబ్బులు రిటర్న్ అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, దీంతో భయపడి కోర్టును ఆశ్రయించినట్లు చెప్పుకొచ్చాడు. కోర్టు ఆదేశాలతో శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మరి ఈ వార్తలపై బెల్లంకొండ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version