Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల

Jd Niharika

Jd Niharika

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగ‌ళ‌వారం రోజున ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తన గురించి సీక్రెట్స్ బయటపెడుతున్న క్రమంలో నిహారిక జేడీ చక్రవర్తి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఈ క్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ గారు పెంచారు. రుద్ర గారు ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి. ఈ సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.