NTV Telugu Site icon

PM Modi: కాంతార, కెజిఎఫ్ హీరోలతో ప్రధాని.. ఫోటో వైరల్

Rishab

Rishab

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బెంగుళూరులో సందడి చేశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్‌లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేసిన ఆయనకు కన్నడిగులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో
ప్రధాని మోదీతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్ సైతం పాల్గొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కన్నడ స్టార్ నటులు యష్, రిషబ్ శెట్టి పాల్గొని ప్రధానిని మీట్ అయ్యారు. వారితో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. కన్నడ సినిమా, కర్నాటక సంస్కృతి వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడం మరియు సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం దక్షిణాది సినిమా ప్రయత్నాలు చేస్తుండడం మంచి విషయమని ఆయన ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Shakuntalam: ఈ పోస్టర్ చాలా హాట్ గురూ…

ఇకపోతే గతేడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. యష్.. కెజిఎఫ్ 2 మరోసారి ప్రపంచాన్ని గడగడలాడించగా, రిషబ్.. కాంతారతో అన్ని ఇండస్ట్రీలలో హిట్ ను కొట్టేశాడు. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే ఎవరికి నచ్చేవి కాదు. అందుకే కన్నడవారు తమ సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయాలంటే భయపడేవారు. కానీ ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాశాయనే చెప్పాలి. ఇంకా ముందు ముందు మంచి సినిమాలను రిలీజ్ చేయడానికి కన్నడ ఇండస్ట్రీ మంచి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రిషబ్.. కాంతార 2 సినిమా తెరకెక్కించే పనుల్లో ఉండగా.. యష్ తన తదుపరి సినిమాను త్వరలోనే ప్రకటించనున్నాడు. మరి ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ ఇంకెలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Show comments