PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది సినిమాల్లో జోష్ పెంచాడు.. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా.. షూటింగ్స్ ను కూడా ఫినిష్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్.. ఒకటా.. రెండా.. నిత్యం పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇక ఇప్పుడు మరో సినిమా వంతు. అదే PKSDT. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కోలీవుడ్ లో వచ్చిన వినోదయా సీతాం రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ దేవుడు టైమ్ గా కనిపిస్తుండగా.. తేజ్.. కుర్ర డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఎప్పటినుంచో ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాకు బ్రో నే టైటిల్ ను ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చారు. అందరు అనుకున్నట్లుగానే అదే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేస్తూ అధికారిక టైటిల్ను మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ అదిరిపోయింది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ము రేపింది.
కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అనే శ్లోకంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పవన్ కళ్యాణ్ క్లాస్ స్వాగ్ అదిరిపోయింది. వెనుక గడియారాన్ని చూపిస్తూ.. పవన్ స్టైలిష్ లుక్ ను రివీల్ చేశారు.. BRO అనే ఇంగ్లిష్ టైటిల్ లో O అనే లెటర్ లో టైమ్ ను చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఈ మెగా మామఅల్లుళ్లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
