Site icon NTV Telugu

Allu Arjun: ఆకాశాన్ని తాకిన అభిమానం…

Allu Arjun

Allu Arjun

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ కి విష్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. పుష్ప పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, పార్ట్ 2తో ఇండియా బౌండరీలు దాటడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అయితే అందరిలా అల్లు అర్జున్ ని బ్రిత్ డే విషెస్ చెప్తే తమ స్పెషాలిటి ఏముంటుందో అనుకున్నారో ఏమో కానీ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఆకాశం నుంచి శుభాకాంక్షలు తెలియజేసింది. రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐకాన్ స్టార్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్’ అనే ఫ్లైట్ బ్యానర్ ని ఎగరేసారు. ఒక ప్రొడక్షన్ హౌజ్, ఒక స్టార్ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ రేంజులో చెప్పడం ఇదే మొదటిసారి. మరి ఫ్యూచర్ లో ఈ ప్రొడక్షన్ హౌజ్ అండ్ బన్నీ కాంబినేషన్ లో సినిమా పడుతుందేమో చూడాలి.

Exit mobile version