Pellindi Kani NO Kahani: పెళ్ళైంది కాని NO కహాని ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!

Raj Tarun

Raj Tarun

టాలీవుడ్‌లో ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం “పెళ్ళైంది కాని NO కహాని”. ‘మై 3 సినిమాస్’ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో శ్రీహరి, స్మిత జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి, నటుడు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. “కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్స్ చేస్తారు. మా సినిమా థియేటర్లలో నవ్వుల విందులా సాగుతుంది. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వగలను, ఒకవేళ నచ్చకపోతే మీ టికెట్ రిటర్న్ ఇచ్చేయొచ్చు. అంతటి ఫన్ ఎంటర్‌టైనర్ ఇది” అని సవాల్ విసిరారు. హీరో శ్రీహరి, మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

×
×
Ad