Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi vs Drishyam : బాక్సాఫీస్ వద్ద కొన్ని పోటీలు కేవలం రెండు సినిమాల మధ్య జరిగేవి కావు. అవి రెండు స్టార్ ఇమేజ్‌ల మధ్య, రెండు మార్కెట్ల మధ్య, రెండు అభిమాన వర్గాల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటాలుగా మారిపోతాయి. ప్రస్తుతం అలాంటి చర్చే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకెళ్తుండగా, మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఎంట్రీతో ఆ సినిమా కలెక్షన్ల వేగం తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మోహన్‌లాల్ కెరీర్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ‘దృశ్యం’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘దృశ్యం 3’ విడుదలైన తొలి రోజుల నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా విదేశీ మార్కెట్లలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.230.23 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో విదేశీ మార్కెట్ల నుంచే రూ.111.15 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం.
Also Read
- Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
- Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
అయితే విడుదలైన రెండు వారాల తర్వాత సినిమా వసూళ్లలో మందగమనం కనిపిస్తోంది. 15వ రోజు ‘దృశ్యం 3’ సుమారు రూ.93 లక్షల వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి. మొత్తం 1,394 షోలు ప్రదర్శించబడినప్పటికీ కలెక్షన్స్ తగ్గుదల నమోదైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ముఖ్యంగా మలయాళ వెర్షన్ నుంచే ఎక్కువ భాగం వసూళ్లు వచ్చాయి. తమిళ వెర్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
ఇదే సమయంలో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విదేశీ మార్కెట్లలో మంచి స్పందనను అందుకుంటోంది. రెండో రోజుకే ఓవర్సీస్లో గణనీయమైన వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం, పలు ప్రాంతాల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిజానికి రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రెండో రోజు విదేశాల నుంచే రూ.8 కోట్లు (దాదాపు $80 మిలియన్లు) వసూలు చేసింది. విదేశాల నుంచి దాని వసూళ్లు ఇప్పుడు రూ 36 కోట్లకు (దాదాపు $30 మిలియన్లు) చేరుకున్నాయి. ఈ చిత్రం మలయాళంలో కూడా లాభాలను ఆర్జిస్తోంది. మొత్తానికి ‘దృశ్యం 3’కి కలెక్షన్లు తగ్గడానికి పెద్ది ప్రభావం కూడా కొంత పడిందనే అభిప్రాయం ట్రేడ్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. మలయాళ ప్రేక్షకులు కూడా ‘పెద్ది’పై ఆసక్తి చూపడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
- Tags
- cinema
తాజావార్తలు
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!