Site icon NTV Telugu

Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్

Songs

Songs

టీజర్‌తో మూవీపై అంచనాలు పెంచడం ఓ స్ట్రాటజీ. ట్రైలర్‌తో బొమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా చేయడం మరో ట్రెండ్.. కానీ సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నాయి ప్యారడైజ్ అండ్ పెద్ది మూవీస్. మార్చి రేసు నుండి సినిమాలు తప్పుకుంటే ఏం.. మాస్ సాంగ్స్‌తో లైమ్ లైట్లో నిలుస్తున్నాయి. మూవీపై హైప్ క్రియేట్ కావాలంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ సింగిల్ వదిలితే చాలు.. సాంగ్ అదిరిపోయిందనుకో ఆటోమేటిక్‪గా బజ్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడదే టాలీవుడ్ ట్రెండ్. చికిరి సాంగ్‌, మీసాల పిల్ల సాంగ్స్ ఇవే ఫ్రూవ్ చేశాయి. చికిరి పాటతో పెద్దిపై అంచనాలు డబుల్ త్రిబుల్ అయ్యేలా చేశాడు బుచ్చిబాబు అండ్ టీం. ఇక తాజాగా వదిలిన మాస్ బీట్ రైరై రారా సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ వాయిస్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్.

Also Read:Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన

నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ప్యారడైజ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆయా షేర్ సాంగ్‌లో నాని లుక్ అండ్ హుక్ స్టెప్పులకు కనెక్టైన యూత్ సోషల్ మీడియాలో రీ క్రియేట్ చేస్తున్నాడు. హిందీలోనూ రీసెంట్లీ రిలీజ్ చేయగా.. ట్రెమండస్ రెస్సాన్స్ తెచ్చుకుంటోంది. వారం రోజుల్లో 52 మిలియన్ వ్యూస్ అండ్ వన్ మిలియన్ లైక్స్‌తో ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది ఈ సింగిల్. అనిరుధ్ మాస్ మ్యూజిక్ అండ్ జంగిరెడ్డి, అర్జున్ చాందీ పాటకు సినిమాపై కావాల్సినంత అటెన్షన్ క్రియేటైంది.

Exit mobile version