Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్లో వాస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావడం లేదని అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ వాయిదా వెనుక కేవలం డేట్ మార్పు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఓటీటీ బేరసారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ సారి వాయిదా వేసిన నిర్మాతలు మరోమారు సినిమాను వాయిదా వేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రస్తుతం వారి పూర్తి ఫోకస్ ప్రముఖ ఓటీటీ సంస్థతో జరుగుతున్న చర్చల పైన ఉంది. ఏప్రిల్ 30 దాటిన తర్వాత, మే నెలలో ఏ తేదీన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే విషయంపై ఓటీటీ పార్ట్నర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్ట్రీమింగ్ నిబంధనలు, థియేట్రికల్ రిలీజ్ మధ్య గ్యాప్ వంటి అంశాలే ఈ చర్చలకు ప్రధాన కారణం.
Also Read :NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న సినిమా రాకపోవడం వల్ల, మునుపటి ఒప్పందం ప్రకారం ఓటీటీ సంస్థ కొంత మేర చెల్లింపుల్లో కోత విధించే అవకాశం ఉందని, దీనివల్ల నిర్మాతలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అనే చర్చ ఉంది. అయితే, ఈ కోత ఎంత మేర ఉంటుంది అనేది ప్రస్తుతానికి సదరు ఓటీటీ సంస్థకు మరియు నిర్మాతలకు మాత్రమే తెలిసిన రహస్యం. అయితే, ఈ డీల్‌లో ఒక ఆసక్తికరమైన మెలిక కూడా ఉందంటున్నారు. అదేమంటే ఒకవేళ సినిమా లేటుగా విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించి, అనుకున్న టార్గెట్ నంబర్స్‌ను దాటితే.. ఓటీటీ సంస్థ అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉందట. అంటే, సినిమా కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతానికి కాస్త డైలమాలో ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే మాత్రం ఓటీటీ నుంచి వచ్చే లాభాలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!