Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ ‘పెద్ది’. జూన్ 4న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది పెద్ది. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి థియేటర్లలో డివైడ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ కథలో విలేజ్ బ్యాక్‌డ్రాప్, క్యారెక్టరైజేషన్లో ఎక్కువ వేరియేషన్స్ ఉండటంతో పాన్-ఇండియా ఆడియన్స్‌కు ఈ సినిమా అంతగా కనెక్ట్ కాలేదు. ఇక రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు అదరగొట్టిన పెద్ది ఆ తర్వాత నెమ్మదించింది. తెలుగు రాష్ట్రాలలో కాస్త పర్లేదనుకున్న పెద్ది నాన్ తెలుగు స్టేట్స్ లో మాత్రం అండర్ పర్ఫెమెన్స్ చేస్తుంది.
ముఖ్యంగా బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్లలో ఈ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. రూ. 218 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటివరకు అందులో సగం మాత్రమే వసూలు చేయగలిగింది. ఇందులో దాదాపు 80% వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఓవర్సీస్ లో భారీ నష్టాల దిశగా వెళ్తోంది. ఓవర్సీస్ ఆడియెన్స్ ఎందుకనో పెద్దిని దూరం పెట్టారు. ఇది బయ్యర్స్ కు అంతుచిక్కని విషయం. ఇక తమిళనాడు, కేరళ సొంతగా రిలీజ్ చేశారు. అక్కడ ఆల్మోస్ట్ క్లోసింగ్ స్టేజ్ లో ఉంది. కర్నాటక సుమారు రూ. 40 కోట్లకు బిజినెస్ జరిగితే సగానికిపైగా నష్టాలు వచ్చేలా ఉంది పరిస్థితి. ఇక తెలుగు స్టేట్స్ లో వైజాగ్, ఈస్ట్, వెస్ట్ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉండగా నైజాం మంచి పర్ఫామ్ చేస్తుంది. నెల్లూరు, రాయలసీమ ఏరియాలు కాస్త స్లోగా నడుస్తున్నాయి.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..