Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది‘. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ రూ. 300 కోట్ల క్లబ్లో చేరినప్పటికీ, ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో మాత్రం ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో భారీ నష్టాల దిశగా పయనిస్తోంది.
సినిమాపై ఉన్న క్రేజ్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కారణంగా నార్త్ అమెరికా మరియు ఓవర్సీస్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అయితే, అక్కడ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కానీ, లాంగ్ రన్ కానీ లభించలేదు. వాస్తవంగా ప్రీమియర్ తో పాటు మొదటి రోజు కలిపి ఈ సినిమా 4మిలియన్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేయగా ఇప్పుడు లాంగ్ రన్ ముగిసే సరికి వచ్చే మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ ఆ ఫిగర్‌కు అటు ఇటుగా ఉండేలా కనిపిస్తోంది. ఈ వసూళ్లు ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసే విషయమే. ‘పెద్ది’ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు ట్రేడ్ రంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో సినిమాలను కొనుగోలు చేసేటప్పుడు, బయ్యర్లు పెట్టే భారీ పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా మార్కెట్ కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉందని ఈ సినిమా స్పష్టం చేస్తోంది. తెలుగు స్టేట్స్ లో పర్వాలేదనే విధంగా వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, ఓవర్సీస్,నాన్ తెలుగు స్టేట్స్ బయ్యర్లకు మాత్రం ఈ సినిమా పెద్ద ఎదురుదెబ్బగానే మిగిలిపోనుంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!