Payal Ghosh: ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అప్పట్లో హీరోయిన్లు ఎవరైనా ఏమైనా చేస్తారనో, పరువు పోతుందనో బయటికి చెప్పేవారు కాదు. కానీ, ఇప్పటి హీరోయిన్లు అలా లేరు. ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ .. తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పటికీ బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో కూడా పాయల్ సుపరిచితమే. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించింది పాయలే. ఇక మరోసారి ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇక ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న పాయల్.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించిన ఆమె తాజాగా తన 11 వ సినిమాను ప్రకటించింది.
Kamal Haasan: ‘ప్రాజెక్ట్ కె’ కు అరుదైన గౌరవం.. కమల్ ఏమన్నాడంటే.. ?
ఇక ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ” ఇది నా 11 వ సినిమా. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ఇంకా 11 వ సినిమా అని అంటే.. కొంతమంది చెప్పినట్లు వాళ్ళతో పడుకుని ఉంటే ఇప్పటివరకు 30 సినిమాలు చేసి ఉండేదాన్ని. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ గా ఉంది. అవకాశాలు కావాలంటే కొన్ని వదులుకోవాలి. అవి చేయలేకనే ఇలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నా.. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడానికి హీరోయిన్లు భయపడేవారు. కానీ, సోషల్ మీడియా వచ్చాక దైర్యంగా వారి గురించి చెప్పి వారి పరువు తీస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
