NTV Telugu Site icon

RRR Movie: ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాలా?

Rrr Movie

Rrr Movie

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. అలాంటిది 50 రోజులు దాటినా ఆర్.ఆర్.ఆర్ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంటే మాములు విషయం కాదు.

త్వరలో ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓటీటీలో విడుదలయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్‌ను జీ5 ప్రకటించింది. ఈనెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. అయితే జీ5 పే పర్ వ్యూ (PPV) పద్ధతిలో ఆర్.ఆర్.ఆర్ మూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఈ మూవీ రెంటల్ పొందాలంటే రూ.699 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్‌పై పలువురు ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 50 రోజులు దాటినా ఓటీటీలో చూడాలంటే ఇంకా డబ్బులు దండుకోవాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Udhayanidhi Stalin: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై!