NTV Telugu Site icon

Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?

Pawan

Pawan

Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో .. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రేపు పవన్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ కు పండుగ రోజు. పది రోజుల ముందు నుంచే.. ఈ పండగను మొదలుపెట్టేశారు. ఇక రేపు పవన్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఖాయమని చెప్పొచ్చు. అయితే తాజాగా..ఫుల్ మీల్స్ కు ముందు ఆకలి పెంచే సూప్ లా.. ఒక అప్డేట్ ను మేకర్స్ అందించారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు. ఇక ఈ మూడు కాకుండా.. గతేడాది పవన్ బర్త్ డేకు సురేందర్ రెడ్డితో ఒక సినిమా ఉంటుంది అని ప్రకటించారు. ఇప్పటివరకు ఆ సినిమా అంతూపంతూ లేకుండా పోయింది. ఇక ఈ మధ్యలో సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Mannara Chopra: డైరెక్టర్ ముద్దు.. మన్నారా చోప్రా షాకింగ్ కామెంట్స్.. బేటీ బేటీ అంటూ?

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను అందుకుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడులా సురేందర్ రెడ్డి.. పవన్ తో హిట్ కొట్టాలని ప్రయత్నాలు సాగించాడు. ఎట్టేకలకు ఆ ప్రయత్నాలు ఫలించాయి. నేడు ఈ సినిమా కోసం ఆఫీస్ ను తెరిచారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. నేడు సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి ఆఫీస్ ను ఓపెన్ చేసిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కూడా రీమేక్ అని తెలుస్తోంది. విక్రమ్ వేదకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments