Mannara Chopra: డైరెక్టర్ ముద్దు.. మన్నారా చోప్రా షాకింగ్ కామెంట్స్.. బేటీ బేటీ అంటూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mannara Chopra on AS Ravi Kumar Chowdary Kiss: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, హీరో, హీరోయిన్లుగా మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. ఈ సినిమాకి చాలా కాలం తరువాత ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించగా డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హీరోయిన్ మన్నారా చోప్రాకు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ కావడంతో డైరెక్టర్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఇక అలా చేయడంపై డైరెక్టర్ స్పందిస్తూ తాను తప్పుడు భావనతో అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెపై ఉన్న ఆప్యాయతతో తాను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు. తాజాగా హీరోయిన్ మన్నారా చోప్రా కూడా ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది.
Bhagavanth Kesari: బిడ్డా!! చిచ్చా వచ్చిండు … మనకి పండగ ముందే తెచ్చిండు
Also Read
ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మన్నారా చోప్రా ఆ ఘటనపై తొలిసారి స్పందించింది. డైరెక్టర్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి ఏఎస్ రవికుమార్ తనని బేటీ బేటీ అనే పిలిచే వారని తెలిపింది, తన వర్క్ ని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని.. సినిమాలో తానే లీడ్ హీరోయిన్ లా ఉంటుందని మెచ్చుకున్నారని చెప్పికొచ్చింది. అలాగే అలా ముద్దు పెట్టుకుని వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా తనకి అర్థం కాలేదని, తన రియాక్షన్ చూస్తే మీకు అర్ధం అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అని డైరెక్టర్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని ఆమె ఈ క్రమంలో వెల్లడించింది.
తాజావార్తలు
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!