OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత సరైన హిట్ పడిందని అంటున్నారు. ఇన్ని రోజులకు పవన్ కల్యాణ్ ను కరెక్ట్ సినిమాలో చూశామంటున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ ను వాళ్లు రిపీట్ చేస్తున్నారు. అదేంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన గబ్బర్ సింగ్ తో పదేళ్ల తర్వాత పవన్ కు భారీ హిట్ ఇచ్చాడు.
Read Also : Sujith : సుజీత్ తర్వాత సినిమా ఆ హీరోతోనే..?
ఇప్పుడు సుజీత్ కూడా పవన్ కు వీరాభిమాని. పవన్ ను కలిస్తే చాలు అనుకున్నాడు. పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తోనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అంటే రెండు సార్లు పవన్ కల్యాణ్ అభిమానులే మంచి హిట్లు ఇచ్చారని అంటున్నారు ప్రేక్షకులు. పవన్ కు సాధారణ జనాల్లోనే కాకుండా సెలబ్రిటీల్లోనూ అభిమానులు ఉంటారు. అదే ఆయన స్పెషాలిటీ. అందుకే ఇప్పుడు ఇద్దరు అభిమానులు డైరెక్టర్లుగా మారితే పవన్ కు హిట్లు పడ్డాయని కామన్ సెంటిమెంట్ ను గుర్తు చేస్తున్నారు.
Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..
