Site icon NTV Telugu

HHVM : ఫైట్ సీన్ కోసం 60 రోజులు కష్టపడ్డ పవన్..

Hhvm Premiere

Hhvm Premiere

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఇందులో జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్‌ ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తారు. ఆయన చరిష్మా థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఇలాంటి ఫైట్ సీన్లలో నటించలేదు. ఇందులో ఫైట్ సీన్లు చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. అందులో ఒకటి పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా డిజైన్ చేయించారు.

Read Also : Coolie : హైదరాబాద్ లో ‘కూలీ’ ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే..?

అది భారీ ఎత్తున ఉంటుంది. 60 రోజులు పట్టింది ఆ సీన్ తీయడానికి. దానికోసం పవన్ కల్యాణ్‌ ప్రతి రోజూ కష్టపడ్డారు. ఆ ఫైట్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది ఫైట్ సీన్. పవన్ కల్యాణ్‌ ను ఆ సీన్ లో చూస్తే ఎవరికైనా వావ్ అనాలనిపిస్తుంది. చారిత్రాత్మక ఫైట్ సీన్లను తలపించేలా ఉంటుంది ఇందులోని ఫైట్. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ యాక్షన్ సీన్లు అందరినీ కట్టిపడేస్తాయి అంటూ తెలిపాడు జ్యోతికృష్ణ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. దానికి డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నారు.

Read Also : HHVM : వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుద్ది.. నిర్మాత కాన్ఫిడెన్స్..

Exit mobile version