’12 మెట్ల కిన్నెర ‘కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో తన గాత్రదానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు “భీమ్లా నాయక్” సాంగ్ తో ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కన్పించాడు. ఆయనకు తాజాగా పవన్ కళ్యాణ్ నుండి భారీ సపోర్ట్ లభించింది.
Read Also : జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్
మొగులయ్యకు పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పవన్ నిన్న సాయంత్రం మొగులయ్యను వ్యక్తిగతంగా కలుసుకుని, ఆయనకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. గతంలో పవన్ కిన్నెర మొగులయ్య వంటి సాంప్రదాయ జానపద కళాకారులకు చాలా కాలం నాటి కళారూపాలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మద్దతు అందించడం చాలా అవసరం అని పేర్కొన్నారు.
పవన్ ఆయనకు చేసిన సాయంపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురిపించారు. “సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య గారికి 2 లక్షలు ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. మీ సహాయం స్పూర్తిదాయకం” అంటూ ట్వీట్ చేశారు.
