జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్

ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది.

Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి

ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ “తలైవి”పై సంతకం చేయడానికి ముందు తనకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదని అన్నారు. “రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు నేను జయలలితను పునరావృతం చేయగలనని విశ్వసించారు. కానీ నా గురించి ఆయనకు ఉన్న నమ్మకం నన్ను ఆశ్చర్యపరిచింది. తెరపై నన్ను నేను చూసుకున్న తర్వాత నేను జయలలితగా నటించానంటే ఆశ్చర్యంగా ఉంది” అని కంగన చెప్పింది. బాక్సాఫీస్ వద్ద తలైవి విజయంపై కూడా కంగనా నమ్మకం వ్యక్తం చేసింది. జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం తన అదృష్టంఅని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామి “ఎంజిఆర్”గా కనిపిస్తారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన కంగనా లుక్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Image
Image
Image
Image

Related Articles

Latest Articles

-Advertisement-