Site icon NTV Telugu

బిగ్ బ్రేకింగ్ : ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా

PSPK and Rana Movie First Song will come out on September 2nd

“భీమ్లా నాయక్’ విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ సినిమాలు ఉండగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గాడు.

Read Also :

https://ntvtelugu.com/producers-press-meet-about-sankranthi-movies/

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతల రిక్వెస్ట్ మేరకు ‘భీమ్లా నాయక్’ ను వాయిదా వేశారట. ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశ్యంతో, టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలను ఒకేసారి ప్రదర్శించేటంత స్క్రీన్స్ సంఖ్య కూడా లేదు కాబట్టి ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేసుకోమని పవన్ తో పాటు సినిమా నిర్మాతను కోరినట్టు దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న, ‘రాధేశ్యామ్’ జనవరి 14న ముందుగా అనుకున్నట్టుగానే విడుదల కానున్నాయి. ఇక ‘భీమ్లా నాయక్’ను మాత్రం జనవరి 12 నుంచి ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు, పవన్ కళ్యాణ్ కు, ప్రొడ్యూసర్ గిల్డ్ నుండి ధన్యవాదాలు’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక పవన్ అభిమానులు కూడా విషయాన్ని అర్థం చేసుకుంటారని భావించారు.

Exit mobile version