పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే తాజాగా సినిమా ఫిబ్రవరి 25నే విడుదల కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో #BheemlaNayakOnFeb25th అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Read Also : “RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధర GOని సవరించాలని భావిస్తుండగా, కొత్త GO ఫిబ్రవరి 15న విడుదల కానుందని భావిస్తున్నారు. అంతలోపు రాత్రి కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఎత్తేస్తారు. కాబట్టి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నాడు. మేకర్స్ త్వరలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను బ్లాక్ చేయమని చెప్పి అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమోషనల్ ప్లాన్‌లు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాయి.
విడుదలకు ముందు రెండు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘భీమ్లా నాయక్’కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తమన్ అందించిన సంగీతం ఇప్పటికే సంచలన విజయం సాధించింది.