NTV Telugu Site icon

Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్

Pawan

Pawan

Pawan Kalyan: షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది. ఇక హరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కన్నా ముందు వరుస ప్లాపులతో ఉన్నాడు. ఒక్క హిట్.. ఒకేఒక్క హిట్ కోసం పవన్ అభిమానులు సైతం ఎదురుచూస్తున్న తరుణంలో హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ ను అనౌన్స్ చేశాడు. అప్పటికే హరీష్ రవితేజతో మిరపకాయ్ సినిమా తీసి మంచి మాస్ హిట్ ను అందుకున్నాడు. దీంతో గబ్బర్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్నీ తాకాయి. అనుకున్నట్లే ఆ అంచనాలను హరీష్ అందుకున్నాడు. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు భారీ కలక్షన్లను రాబట్టింది గబ్బర్ సింగ్.

Kajal Aggarwal: బాలీవుడ్ లో నీతి, విలువలు లేవు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను అని పవన్ తోనే ట్రెండ్ సెట్ చేశాడు హరీష్ శంకర్. ఇక ఆ సినిమా తరువాత మళ్లీ పవన్ తో హరీష్ జత కట్టిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. త్వరలోనే పవన్ ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇకపోతే నేడు హరిశ శంకర్ పుట్టినరోజు. కాగా, పవన్ కళ్యాణ్, తన ఉస్తాద్ డైరెక్టర్ కు స్పెషల్ గా విష్ చేశాడు. “ప్రేక్షకుల నాడీ.. నవతరం అభిరుచులు తెలిసిన దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు భాష, రచనలపైనా, కళల గురించి చక్కటి అవగాహన ఉన్న దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

Show comments