Site icon NTV Telugu

Mahesh Babu: ఆ సమయంలో మహేష్ కు మద్దతుగా నిలబడిన పవన్ కళ్యాణ్

Mahesh

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం విదితమే. ఇక మహేష్ బర్త్ డే ను అభిమానులు పండగలా జరుపుకొంటున్నారు. అన్నదానాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో మహేష్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో మహేష్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనదైన రీతిలో మహేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.”ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం.

‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై మహేష్, పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version