NTV Telugu Site icon

Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!

Pawan Kalyan Bro

Pawan Kalyan Bro

ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్‌కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓజి ఈ ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్‌లోనే రాబోతోందని కన్ఫర్మేషన్ వచ్చేసింది.

ఇక హరిహ వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కుదిరితే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ ఎంత డిలే అయినా నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి రావడం పక్కా. ఈ లెక్కన వచ్చే ఏడాది పవర్ స్టార్ నుంచి ఏకంగా మూడు సినిమాలు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. కాబట్టి… నెక్స్ట్ ఇయర్ పవర్ స్టార్ ర్యాంపేజ్ మామూలుగా ఉండవని చెప్పొచ్చు. రీ ఎంట్రీ తర్వాత పవన్ నుంచి 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ 100 కోట్ల సినిమాలని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే మూడు భారీ ప్రాజెక్ట్స్‌ విడుదల చేసి, మూడు వందల కోట్లు కొల్లగొడతాడా లేక అంతకు మించి కలెక్ట్ చేస్తాడా అనేది చూడాలి.

Show comments