Site icon NTV Telugu

Power Star: బాస్ పార్టీ సాంగ్ చూసేసిన పవన్ కళ్యాణ్!

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా ఇందులోని బాస్ పార్టీ సాంగ్ ను రేపు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి ఎ.ఎస్. ప్రకాశ్‌ ఆర్ట్ డైరక్టర్ మాత్రమే కాదు ప్రొడక్షన్ డిజైనర్ కూడా. ఈ పాట కోసం ఆయన వేసిన సెట్ ను ప్రత్యేకంగా చిరంజీవి అభినందిస్తూ, ట్వీట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే… తాజాగా బాస్ పార్టీ సాంగ్ ను చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వీక్షించారు. ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ స్పాట్ కు తన ‘హరిహర వీరమల్లు’ చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం. రత్నంతో కలిసి వెళ్ళారు. ఈ పాటను దర్శకుడు బాబీ పవర్ కళ్యాణ్ కు చూపించారు. ఆయనకు ఈ పాట ఎంతో నచ్చిందని, తనను అభినందించారని బాబీ ఈ సందర్భంగా తెలిపారు. విశేషం ఏమంటే… ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా చిరంజీవితో కాలు కదిపింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే ఈ పాటను రాయడం విశేషం. దీనిని నకాశ్ అజీజ్, హరిప్రియా పాడారు. మాస్ మహరాజా రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటించింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. జి.కె. మోహన్ ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version