NTV Telugu Site icon

Pawan Kalyan: ఒక రోజా వచ్చిందంటే.. దాని కారణం ఈయనే

Tej

Tej

Pawan Kalyan:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించబడిన బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మెగా హీరోలు వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ హాజరుకాగా సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ వేడుక సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు 8:30 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి కాస్త లేటుగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సుదీర్ఘంగా తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సుమారు అర్థగంటకు పైగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అనేక విషయాలను స్పృశించారు.

“నేను 80 పర్సెంట్ సినిమాలో ఉంటాను. గెస్ట్ క్యారెక్టర్ ఏం కాదు.. చాలా ఫాస్ట్ గా చేశాను. అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్ గారు.. తెలుగు సినిమాపై మక్కువతో ఈ సినిమాను నిర్మించారు. ఇక నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన నీతూ లుల్లూ.. నాకు మంచి లుక్ అందించారు. ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ తో ఈ సినిమా ఉంది అంటే దానికి కారణం ఆమెనే. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నవ్వుతు ఏడుస్తాం. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రఖని గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమిళ చిత్ర పరిశ్రమకు కూడా నాదొక విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికి అన్నం పెడుతుంది. అందరిని తీసుకుంటుంది. తమిళ్ చిత్ర పరిశ్రమ కూడా అందరిని తీసుకోండి. తమిళ్ పరిశ్రమ తమిళ్ వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు పరిశ్రమ ఎదుగుతున్నాం అంటే.. అన్ని పరిశ్రమలకు సంబంధించిన వారిని తీసుకుంటున్నాం. ఒక్కళ్ళు కాదు.. ఇది అన్ని భాషలు.. అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప .. కేవలం మన భాష, మనమే ఉండాలి అంటే.. కుంచించుకుపోతాం. తమిళ్ భాష వారు తమిళ్ వాళ్లనే తీసుకుంటున్నాం అని బయట చెప్తుంటే వింటున్నాం. మీరు కూడా తమిళ్ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక రోజా వచ్చిందంటే దానికి కారణం.. ఎఎం రత్నం గారు.. ఒక రోజా, జెంటిల్ మెన్.. ఇలాంటి సినిమాలు బయటకు వచ్చాయి. తమిళ్ సినిమా బయటకు వచ్చింది అంటే అది ఆయన వలనే. కళాకారుడుకు కులం, మతం, ప్రాంతం ఉంటే పరిశ్రమ ఎదిగాడు.. ఏవైనా కార్మిక సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరు ఒక్కటిగా ఉండాలి. ఆ పరిధులను దాటి ఎదగాలని.. తమిళ్ పరిశ్రమ పెద్దలకు మనవి చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Show comments