NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..

Prabhas

Prabhas

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు. ఇక నరసాపురం .. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు కు పక్కనే ఉన్న నరసాపురంలో పవన్ సభ మొదలు అయ్యింది, ఇక ఈ సభలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సందడి చేశారు. వారికి ప్రత్యేకంగా పవన్ థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా తమకు మద్దతు తెలుపని అడిగారు. ఇక ప్రభాస్ గురించి, ఆయన నటించిన సినిమాల గురించి పవన్ చెప్పుకొచ్చారు.

Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..

జనసేనకు మద్దతు తెలిపిన నరసాపురం ప్రభాస్ గారి అభిమానులకు ధన్యవాదాలు అని మొదలుపెట్టిన పవన్.. జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు అన్ని వేల కోట్లు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రభాస్ అంటే తనకు అభిమానం అని, ప్రభాస్ బాహుబలి చేసినా, ఆదిపురుష్ చేసినా సరే రోజుకు 500 నుండి 1000 మందికి ఉపాధి కల్పిస్తారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. టాక్సులు కడతారు. ఈ జగన్ ప్రభాస్ లా నీతిగా సంపాదించడు, కానీ వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయి చెప్పాలి అని పవన్ ప్రశ్నించారు. దఈ వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ తో పాటు.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.