Site icon NTV Telugu

Pawan Kalyan: షూటింగ్ లో కూడా వదలని జన సైనికులు.. మరీ ఇంత అభిమానం ఏంటి సామీ

Pawan

Pawan

Pawan Kalyan: అభిమానం.. ఒక మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తోంది. అందుకు ఉదాహరణే ఈ జన సైనికులు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడానికి రాజమండ్రి నుంచి మహారాష్ట్ర వరకు ప్రయాణించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం పవన్ .. ఒకపక్క సినిమాలతో ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే పవన్.. ప్రస్తుతం OG సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం మొత్తం గతవారం మహారాష్ట్ర వెళ్లిన విషయం తెల్సిందే. గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Pushpa 2: ‘పుష్ప 2’ లో ఐటెంసాంగ్.. బన్నీకి టైట్ హాగ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ..?

ఇక ఈ నేపథ్యంలోనే నేడు మహారాష్ట్రలోని వాయ్ లేక్ వద్ద షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ ప్రత్యేక్షమయ్యారు జనసైనికులు.. పవన్ కోసం జనసేన ఫ్లెక్సీని పట్టుకొని ఎదురుచూస్తున్నారు. అది చూసిన పవన్ వెంటనే వారిదగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కున్నారు. వారు రాజమండ్రి నుంచి వచ్చిన సింగిరి సాయి, సింగిరి రాజేష్, సన్నీ జాన్ అని తెలుస్తోంది. ఇక వారితో పవన్ ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ” మహారాష్ట్రలో వాయ్ సరస్సు వద్ద జరుగుతున్న OG షూటింగ్ లో జన సైనికులు అయిన సింగిరి సాయి, సింగిరి రాజేష్, సన్నీ జాన్ ను కలవడం జరిగింది” అని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఫొటోలో పవన్ లుక్ మరోసారి హీట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఫోటోలో జపనీస్ సమురాయ్ లుక్ లో కనిపించాడు. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవారు వేసుకొనే డ్రెస్.. ఖుషి, జల్సాలో పవన్ ఈ లుక్ లో కనిపించాడు.. ఇప్పుడు OG లో కూడా అదే లుక్ లో కనిపిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మరి ఈ సినిమాలో పవన్ ను సుజీత్ ఏ రేంజ్ లో చూపించబోతున్నాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version