Pawan Kalyan : పవర్ స్టార్ గా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పేరు చెప్పాలంటే కేవలం స్టార్ ఇమేజ్ గురించే కాదు.. విలువల గురించీ కూడా అంటుంటారు ఆయన అభిమానులు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు యాడ్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటే.. పవన్ మాత్రం డబ్బు గురించి ఎప్పుడూ ఆరాటపడరు. పవన్ కల్యాణ్ అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్నా సరే పెద్దగా యాడ్స్ లలో నటించరు. అది ఆయన వ్యక్తిత్వం అనే చెప్పుకోవాలి. 2022లో సుమారు రూ.150 కోట్ల విలువైన యాడ్ ఆఫర్లను ఆయన తిరస్కరించాడు. పవన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని.. పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి.
Read Also : Vishnu Priya : డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లి తప్పు చేశా..
సాఫ్ట్‌డ్రింక్స్, గాడ్జెట్లు, క్లోతింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ బ్రాండ్లు.. ఇలా చాలా కంపెనీలే ఆయన వద్దకు వచ్చాయి. కానీ ఆయన మాత్రం వద్దని చెప్పేశారంట. “నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను అని తేల్చేశారంట. పవన్ కల్యాణ్ ను కోట్లాది మంది అభిమానులు నమ్ముతుంటారు. ఆయన ఒక యాడ్ చేస్తే వారంతా దాన్ని కొనేస్తారు.. నమ్ముతారు. కాబ్టటి తన అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక.. వారి బాగు కోసం ఆయన ఇలాంటివి అస్సలు చేయను అని చెప్పేశారంట. కమర్షియల్ యాడ్స్ చేయడం తన విలువలకు విరుద్ధమని భావించారట. సినీ రంగంలో పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే హీరోల్లో పవన్ ఒకరు. అయినప్పటికీ కోట్ల కోసం కాకుండా విలువల కోసం ఆయన నిలబడుతున్నారని అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో రొమాంటిక్ మోమెంట్స్
