Pawan Kalyan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. దాన్ని ఎవరు పాటించినా పాటించకపోయినా.. సెలబ్రిటీలు మాత్రం కచ్చితంగా పాటిస్తారు. అసలే ఇండస్ట్రీ.. ఎవరిని లేపుతుందో.. ఎవరిని ముంచుతుందో చెప్పలేం. అందుకే నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఒక సినిమా హిట్ అవ్వడం ఆలస్యం.. వెంటనే ప్రొడక్స్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ లుగా మారి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక్క యాడ్ కు కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న స్టార్ సెలబ్రిటీలు అందరూ యాడ్స్ చేస్తున్నవారే. మొన్నటివరకు బాలకృష్ణ ఒక్కడే యాడ్ చేయలేదని చెప్పుకొచ్చేవారు.. కానీ, ఈ మధ్య బాలయ్య సైతం యాడ్స్ చేస్తూ సంపాదిస్తున్నాడు.
ఇక తాజాగా పవన్ కూడా ఇందులోకి అడుగుపెట్టినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సినిమాలు కూడా ఆయన కేవలం పార్టీని నడపడానికి డబ్బు లేక చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో వాటిని ఫినిష్ చేయకుండానే ప్రచారాల్లో బిజీగా ఉన్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్.. డబ్బు కోసం ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్ మొదట్లో పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ తరువాత యాడ్స్ చేయలేదు. ఇప్పుడు డబ్బు కోసం యాడ్ చేయడానికి పవన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక హెల్త్ యాప్ ను ప్రమోట్ చేయడానికి పవన్ ముందుకొచ్చాడట. రెండు రోజులు ఈ యాడ్ కోసం పవన్ తన డేట్స్ ఇచ్చాడట. కేవలం రెండు రోజుల షూట్ కోసం దాదాపు రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు టాక్. పవన్ అంటే ఆ మాత్రం ఉంటుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ యాడ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.