హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇచ్చిన ఎమోషనల్ టచ్‌తో.. అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగానే ఆకట్టుకుంది బ్రో సినిమా. అందుకే.. డే వన్ 48 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టిన బ్రో.. సెకండ్ డే 27 కోట్లకి పైగా గ్రాస్‌ని రాబట్టి.. మొత్తంగా రెండు రోజుల్లో 75 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు కూడా కూడా బ్రో హవా నడించింది.
థర్డ్ డే 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో పవన్ కెరీర్లోనే ఫాస్ట్‌గా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ‘బ్రో’ నిలిచింది. అంతేకాదు.. రీ ఎంట్రి తర్వాత హ్యాట్రిక్ హిట్‌తో పాటు హ్యాట్రిక్ సెంచరీ కొట్టి.. తన స్టామినా ఏంటో చూపించాడు వపర్ స్టార్. వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో వంద కోట్లు కొల్లగొట్టాడు. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక బ్రో తర్వాత పవన్ నుంచి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రానున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ప్రజెంట్ సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ముందుగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పవన్ వరుసగా సెంచరీలు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.