HHVM : పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. మిగిలిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు షూట్ జరుపుకుంటున్నాయి. అయితే ఓజీకి ఉన్నంత క్రేజ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలకు లేవు. పవన్ ఎక్కడకు వెళ్లినా ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తున్నారు. దాని గురించే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై నిర్మాత ఏఎం రత్నం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. ఓజీ సినిమాకు మిగతా రెండు సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న మాట నిజమే అన్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు ఎక్కువగా వయలెన్స్ ను కోరుకుంటున్నట్టు అభిప్రాయపడ్డారు పవన్. ఒకప్పుడు హీరో అంటే మంచి వాడిగా మాత్రమే ఊహించుకునేవారన్నారు.
Read Also : HHVM : హరిహర వీరమల్లుకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ఒకప్పుడు హీరోను రాముడి తరహాలు బుద్ధిమంతుడిగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఓజీలో అలాంటి హింస, నెగెటివ్ షేడ్స్ ఉండటం వల్లే ప్రేక్షకులు దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో అది లేదు. కానీ ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంది. దేన్నీ తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త తరహా పాత్రలో నన్ను వీరమల్లు సినిమాలో మీరు చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : HHVM : వీరమల్లుకు ఆ రెండు జిల్లాల్లో భారీ వసూళ్లు..?
