Site icon NTV Telugu

Pawan Kalyan: ‘బ్రో’.. అసలే ఎండాకాలం.. నువ్వు మరింత హీట్ పెంచేస్తున్నావ్

Bro

Bro

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఈ రేంజ్ లో స్పీడ్ పెంచలేదు. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు.. ఏడాదికి ఒకసారి వచ్చే అప్డేట్ తో ఏడాది మొత్తం సంబరాలు చేసుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు.. నిత్యం వచ్చే పవన్ లుక్స్ తో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఉస్తాద్ ఒకరోజు వస్తే.. బ్రో ఒకరోజు వస్తాడు.. OG ఒకరోజు కనిపిస్తే.. వీరమల్లు మరోరోజు సందడి చేస్తాడు. ఇక ఇవేమి లేనప్పుడు వైట్ అండ్ వైట్ జనసేనాని దర్శనం ఎలాగూ ఉంటుంది. దీంతో నిత్యం పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎలాగైనా అన్ని సినిమాలను పూర్తి చేయాలనీ పవన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక ఈ మధ్యనే ఉస్తాద్ ను, OG ని పట్టాలెక్కించాడు. కొద్దిగా గ్యాప్ తీసుకొని నేటి నుంచి బ్రో కూడా సెట్ మీదకు తీసుకొచ్చేశాడు పవన్. నేడు బ్రో సెట్ లో దేవుడు ప్రత్యేక్షమయ్యాడు. ఇక పవన్ సెట్ కు రావడం దగ్గరనుంచి షూటింగ్ మొదలుపెట్టేవరకు వీడియో తీసి మేకర్స్ అభిమానుల కోసం షేర్ చేయడం.. అది కాస్తా వైరల్ గా మారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.

Ram Charan: ఎన్టీఆర్ తో బ్రేక్ ఫాస్ట్ చేశా.. అంతకు మించిన అదృష్టం లేదు

ఒక పెద్ద కారులో సింపుల్ కుర్తా ఫైజామాతో దిగేశాడు పవన్. ఇక ఆయనను రిసీవ్ చేసుకోవడానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ రావడం.. సెట్ లో సన్నివేశాల గురించి చర్చించుకోవడం లాంటివి చూపించారు. ఇక ఆర్ట్ డైరెక్టర్ సహా కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా సమక్షంలో పవన్ కి ఒక సన్నివేశాన్ని వివరిస్తూ ఫోటోకి కూడా పోజులిచ్చారు. ఈ వీడియోను మేకర్స్ పోస్ట్ చేస్తూ.. ” మన బ్రో.. పవన్ కళ్యాణ్.. సెట్స్ లోకి అడుగుపెట్టి.. వాతావరణాన్ని మరింత హీట్ అయ్యేలా చేశారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఎండాకాలం.. నీ లుక్స్ తో మరింత హీట్ పెంచుతున్నావ్ అన్నా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి హిట్టును అందుకుంటాడో చూడాలి.

Exit mobile version