Site icon NTV Telugu

Pawan Kalyan: ఇండస్ట్రీ తలెత్తుకొనేలా చేయాలి.. దిల్ రాజు కు పవన్ సూచన

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ యమా యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఏది జరిగినా అందుకు పవన్ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఫిల్మ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన దిల్ రాజు తో పాటు నూతన కార్యవర్గానికి పవన్ శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. “ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను” అంటూ తెలిపాడు.

MP Ranjith Reddy: రైతులపై కాంగ్రెస్ చూపిస్తున్నది కపడ ప్రేమ..

అంతేకాకుండా స్పెషల్ గా దిల్ రాజు కు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు శుభకాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇక రెండు రోజుల క్రితం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో సి. కళ్యాణ్ ప్యానెల్ కు పోటీగా దిల్ రాజు ప్యానెల్ పోటీకి దిగి.. భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. నిన్ననే దిల్ రాజు.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. చిన్న సినిమాలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇవ్వడంతోనే నిర్మాతలు దిల్ రాజునూ ఎన్నుకున్నారు. మరి హార్ట్ కింగ్ ఆ హామీలను నెరవేరుస్తాడా ..? లేదా.. ? అనేది చూడాలి.

Exit mobile version