Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ తీసుకుంటూ పనిచేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరంగా మెగా, నందమూరి కుటుంబాల నుంచి ‘బాబాయ్-అబ్బాయి’ జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల్లో గాయపడటంతో మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా గాయాల కారణంగా చికిత్స తీసుకోవాల్సి రావడం అభిమానులను కలవరపెడుతోంది.
‘పెద్ది’ సినిమా కుస్తీ సన్నివేశాల షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టుకు గాయం అయింది. దీని తీవ్రత కారణంగా వైద్యుల సూచన మేరకు కోయంబత్తూరులో నిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఇక పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తదుపరి ప్రాజెక్టుల షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజానికి గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల షెడ్యూల్‌కు అనుగుణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తున్న అంశం ఏమిటంటే, మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒక జంటగా, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ మరో జంటగా గాయాల బారిన పడటం. ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ, అభిమానులు మాత్రం వరుస సంఘటనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
అయితే ఈ గాయాల ప్రభావం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల షూటింగ్ షెడ్యూల్‌లపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదని సమాచారం. కానీ డిసెంబర్ విడుదల లక్ష్యంగా రూపొందుతున్న బాలకృష్ణ NBK111 మూవీపై మాత్రం కొంత ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టార్ హీరోలు తమ సినిమాల కోసం డూప్‌లకు బదులుగా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తుంటారు. అదే సమయంలో ఇలాంటి రిస్క్‌ల వల్ల గాయాలు కూడా తప్పడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులందరూ ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!