పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెంటలెక్కిపోయే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఓల్డ్ స్కూల్ స్వాగ్, స్టైలిష్ యాక్షన్‌తో థియేటర్లలో విధ్వంసం సృష్టించిన ‘OG’కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను మేకర్స్ అధికారికంగా నిజం చేశారు. కేవలం పార్ట్ 2 అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలవబోయే ‘OG యూనివర్స్’ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. “తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది”** అంటూ మేకర్స్ అఫీషియల్‌గా OG2 ను అనౌన్స్ చేశారు.
ఈ అప్‌డేట్‌పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ చేసిన ట్వీట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. “You asked, We heard… Welcome to the #OGUniverse #OG2”** (మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం) అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేస్తూ.. “From the #OG himself..! #OGUniverse” అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ అధికారికంగా మెగా కన్ఫర్మేషన్ ఇచ్చింది. బాస్ స్వయంగా రంగంలోకి దిగి తన ఓన్ బ్యానర్‌లో ఈ మైండ్ బ్లోయింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను అనౌన్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలుపెట్టారు.

