Site icon NTV Telugu

OG : ఓజీ అప్డేట్.. పవన్ షూట్ లో పాల్గొనేది అప్పటి నుంచే..

Og

Og

OG : పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ లైన్ లో పెట్టేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను కంప్లీట్ చేసేసిన పవన్.. ఇప్పుడు ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది గానీ.. ఇందులో పవన్ ఇంకా పాల్గొనలేదు. అయితే తాజాగా ఆ గుడ్ న్యూస్ కూడా వినిపించేశారు. ఈ మూవీ షూట్ లో శనివారం నుంచి పవన్ కల్యాణ్‌ పాల్గొంటారంట. ఈ విషయాన్ని మూవీ టీమ్ స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్‌ శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు హాజరు అవుతున్నారు.

Read Also : Bhairavam : ఆ యాక్షన్ సీన్ లో రోహిత్ అదిరిపోయాడు.. మనోజ్ ప్రశంసలు..

ఓజీని కంటిన్యూగా షూటింగ్ చేసి ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రాజకీయాల్లో పవన్ చాలా బిజీగా ఉండటం వల్ల మళ్లీ టైమ్ దొరక్కపోవచ్చు. అందుకే ఈ గ్యాప్ లోనే మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన సీన్లను దాదాపు కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ముంబైలో ఓ భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా పెద్ద సెట్ వేశారంట.

ఇవన్నీ పవన్ సీన్లకు సంబంధించినవే అని తెలుస్తోంది. ఈ మూవీని గ్యాంగ్ స్టర్ పాత్ర నేపథ్యంలో తీస్తున్నారు. గతంలో కొంత షూటింగ్ చేశారు. కానీ ఎన్నికల సమయంలో ఆపేసి.. మళ్లీ ఇన్ని రోజులకు రీస్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ రెండు పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

Read Also : Coolie : ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ కొనేసిన నాగార్జున?

Exit mobile version