చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఒక విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ తమ అవసరానికి వాడుకొంటుంది అని నొక్కి వక్కాణిస్తున్నారు. అందుకు నిదర్శనం కూడా లేకపోలేదు.
ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీ బాగుండాలని గొంతెత్తి మాట్లాడితే చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు మద్దతు ఇచ్చింది లేదు.. కనీసం పవన్ గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నవారిని ఆపింది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు తమ సినిమాను వాయిదా వేయమని పవన్ ని వారొచ్చి అడగడం .. వెంటనే పవన్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. అది పవన్ కళ్యాణ్ మంచితనం అంటే.. ఆ మంచితనం అర్ధం చేసుకోనైనా పవన్ కి సపోర్ట్ గా నిలుస్తారా..? అంటే అది లేదని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. అసలు సినిమాను వాయిదా వేసుకోవాల్సిన అవసరం పవన్ కి లేదు.. కానీ, పెద్దవాళ్ళ మాట వినేవాడు కాబట్టి, మంచి చెడ్డలు బేరీజు వేసుకోగల సమర్థుడు కాబట్టి పవన్ మంచి మనసుతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని కానీ , ఆయనకు ఏనాడూ టాలీవుడ్ సపోర్ట్ గా నిలిచింది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు.
ఇక రాజకీయ పరంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మనిషికి ఇక్కడ కూడా సపోర్ట్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ సినిమా విడుదలైతే ఏమవుతుంది..? ఎందుకు వారికి భయం .. ఎందుకు ఆ సినిమాను వారు అంతగా తప్పించాలని చూస్తున్నారు అని అభిమానులు నిర్మొహమాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నింటికి సమాధానాలు ఎవరు చెప్పాలి..? అస్సలు నిజంగా జరిగింది ఏంటి..? అనేది ఎవరికి తెలియని మర్మ రహస్యం. ఏదిఏమైనా ఇండస్ట్రీలో అవసరానికి కొన్నిసార్లు పవన్ పేరును ఇంకొన్ని సార్లు పవన్ మాట వాడితేనే పనులు జరుగుతాయని టాలీవుడ్ లోని పలువురు పెద్దల మాట.
