NTV Telugu Site icon

Sahoo: మూడేళ్ల తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంటున్న ‘సాహో’

Sahoo

Sahoo

ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ‘సాహో’ చిత్ర యూనిట్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేసింది. ఇక ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ అందుకోవడమే లేట్ అని అంతా అనుకున్నారు కానీ ‘సాహూ’ రిలీజ్ అయ్యాకా అంతా తలకిందులు అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

ప్రభాస్ లుక్స్ నుంచి ప్రతి విషయంలో కామెంట్స్ ని ఫేస్ చేసింది ‘సాహో’ సినిమా. దర్శకుడు సుజిత్, ప్రభాస్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వేస్ట్ చేశాడు అంటూ విమర్శించిన వాళ్లు చాలామందే ఉన్నారు. 350 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాని కొన్న ప్రతి ఒక్కరూ నష్టపోవడం గ్యారెంటీ కానీ సాహో విషయంలో ఇలా జరగలేదు. సౌత్ లో నిరాశ పరిచిన ఈ మూవీ, ఓవరాల్ గా 450 కోట్లు రాబట్టింది. నార్త్ లో సాహూ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. సాహూ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీని హిట్, కల్ట్ క్లాసిక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సాహూ సినిమాకి కల్ట్ స్టేటస్ ఇస్తున్న వారిలో అత్యధికమంది ‘మెగా అభిమానులే’ కావడం విశేషం. సాహూ  డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు.

డీవీవీ దానయ్య ప్రొడక్షన్ హౌజ్ నుంచి రానున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే బయటకి వచ్చిందో, అప్పటినుంచి సాహో సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. పైగా సుజిత్, పవన్ సినిమా గురించి ప్రభాస్ కూడా అభినందించడంతో… ప్రభాస్ పవన్ కళ్యాణ్ ల మ్యూచువల్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. కొంతమంది అభిమానులు, సుజిత్ యూనివర్స్ క్రియేట్ చేసి ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని కలిపితే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యొచ్చు అనే సలహాలు కూడా ఇస్తున్నారు. మరి స్వతహాగా పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన సుజిత్, తన సినిమాలో ప్రభాస్ తో క్యామియో ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

Show comments