Sahoo: మూడేళ్ల తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంటున్న ‘సాహో’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ‘సాహో’ చిత్ర యూనిట్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేసింది. ఇక ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ అందుకోవడమే లేట్ అని అంతా అనుకున్నారు కానీ ‘సాహూ’ రిలీజ్ అయ్యాకా అంతా తలకిందులు అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ప్రభాస్ లుక్స్ నుంచి ప్రతి విషయంలో కామెంట్స్ ని ఫేస్ చేసింది ‘సాహో’ సినిమా. దర్శకుడు సుజిత్, ప్రభాస్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వేస్ట్ చేశాడు అంటూ విమర్శించిన వాళ్లు చాలామందే ఉన్నారు. 350 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాని కొన్న ప్రతి ఒక్కరూ నష్టపోవడం గ్యారెంటీ కానీ సాహో విషయంలో ఇలా జరగలేదు. సౌత్ లో నిరాశ పరిచిన ఈ మూవీ, ఓవరాల్ గా 450 కోట్లు రాబట్టింది. నార్త్ లో సాహూ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. సాహూ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీని హిట్, కల్ట్ క్లాసిక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సాహూ సినిమాకి కల్ట్ స్టేటస్ ఇస్తున్న వారిలో అత్యధికమంది ‘మెగా అభిమానులే’ కావడం విశేషం. సాహూ డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
డీవీవీ దానయ్య ప్రొడక్షన్ హౌజ్ నుంచి రానున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే బయటకి వచ్చిందో, అప్పటినుంచి సాహో సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. పైగా సుజిత్, పవన్ సినిమా గురించి ప్రభాస్ కూడా అభినందించడంతో… ప్రభాస్ పవన్ కళ్యాణ్ ల మ్యూచువల్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. కొంతమంది అభిమానులు, సుజిత్ యూనివర్స్ క్రియేట్ చేసి ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని కలిపితే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యొచ్చు అనే సలహాలు కూడా ఇస్తున్నారు. మరి స్వతహాగా పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన సుజిత్, తన సినిమాలో ప్రభాస్ తో క్యామియో ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?