Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా మే 26 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఈవెంట్ లో పవిత్రా లోకేష్- నరేష్ దండలు మార్చుకున్నారు. ఈ వేదికపై పవిత్రా లోకేష్ మాట్లాడే ముందు నరేష్ కు, ఎంఎస్ రాజు కాళ్లకు దండం పెట్టి స్పీచ్ స్టార్ట్ చేసింది.
Anchor Varshini: క్రికెటర్ తో వర్షిణి ఎఫైర్.. వేణుస్వామి మాటలు నిజం కాబోతున్నాయా..?
” ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ దేవుడు ఇచ్చిన లైఫ్ ఎలా జరిగితే అలా బతికేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఆ అదృష్టం వచ్చింది. మాములుగా ఏ ఆడపిల్లకు అయినా.. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది. అది చేయాలి.. ఇది చేయాలి.. అవి కొనాలి.. ఇంత సంపాదించాలి అని.. నాక్కూడా ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ను ఫుల్ ఫిల్ చేయడానికి మా నాన్నగారు కూడా లేరు. దాంతో నేనే ఒంటరిగా నాకొక ఎంపైర్ ను క్రియేట్ చేసుకున్నాను. నా స్థాయికి తగ్గట్టు నేను కష్టపడి సంపాదించుకున్నాను. అయితే నా జీవితంలో చాలా దుష్ట శక్తులు వచ్చాయి. వారిని నేను ఎదుర్కొంటూనే వచ్చాను.. కానీ, ఇప్పుడు నన్ను కాపాడడానికి నా వెనుక ఒక శక్తి ఉంది. అది నరేష్. ఆయన కూడా తన జీవితంలో కొత్త కొత్త పనులు మొదలుపెడుతున్నాడు. మళ్లీ విజయ కృష్ణ బ్యానర్ ను ఓపెన్ చేసి.. మంచి మంచి సినిమాలను అందివ్వడానికి రెడీ అవుతున్నారు. నరేష్ లాంటి సంస్కారం ఉన్న వ్యక్తిని తమకు ఇచ్చినందుకు మహాతల్లి విజయనిర్మల గారికి థాంక్స్ చెప్పాలి. ఇక ఇక్కడ ఉన్నవారందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన కృష్ణగారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, నారెహ్స్ అభిమానులు కూడా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థాంక్స్.. ఎంతో పెద్ద హృదయంతో మీరందరు నన్ను అంగీకరించారు. అందుకు నేను ఎంతో ఆశీర్వాదం పొంది ఉంటాను. ఇక మళ్లీ పెళ్లి గురించి చెప్పాలి అంటే.. ఎంఎస్ రాజు- నరేష్ వలన మాత్రం అవుతుంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
