NTV Telugu Site icon

Pavitra Lokesh: డబ్బు కోసం పవిత్ర ఎంతకైనా దిగజారుద్ది..

Pavitra

Pavitra

Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమా దగ్గర నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. పెళ్లితో ముగుస్తోంది అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక షూట్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. నరేష్.. మా పెళ్లి జరిగింది ఆశీర్వదించండి అంటూ షేర్ చేశాడు. ఇక అంతేకాకుండా దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే అందులో నిజం లేదని, అదంతా సినిమా షూటింగ్ కోసమని తెలిసి అభిమానులు వారిని తిట్టి పోశారు. నిజంచెప్పాలంటే.. వారిద్దరూ చిన్న పిల్లలు కాదు.. కుర్రవాళ్లు కూడా కాదు.. ఈ వయస్సులో వీరు ఇలాంటి పనులు చేయొచ్చా.. అని అడిగివారే ఎక్కువమంది ఉన్నారు. సరే చేస్తే చేశారు.. అది వారి పర్సనల్ విషయం. కానీ, దాన్ని ఎందుకు పబ్లిక్ చేయడం అనేది వారి వాదన. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వీరిద్దరి గురించి అంతకుముందు వీరితో కాపురం చేసిన వారు ఘాటు ఆరోపణలు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

Ananya Pandey: ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిన ‘లైగర్’ బ్యూటీ.. సిగ్గులేదు

ఇప్పటివరకు నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్ గురించి, అతడి క్యారెక్టర్ గురించి ఎంత నీచంగా చెప్పిందో అందరికి తెల్సిందే. తన కొడుకు కోసం వాటిని భరించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇటుపక్క పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ సైతం పవిత్ర గురించి చాలా దారుణంగా మాట్లాడడం గమనార్హం. తాజాగా తమిళ్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుచేంద్ర ప్రసాద్.. పవిత్ర గురించి, ఆమె క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. ” పవిత్రకు డబ్బు కావాలి.. ఆమె డబ్బుకోసం ఎంతకైనా దిగజారుద్ది. ఆస్తి కోసమే నరేష్ తో లవ్ ట్రాక్ నడిపింది. అతని వెనుక ఉన్న రూ. 1500 కోట్లు కోసమే అతడిని ట్రాప్ చేసి ముగ్గులోకి దింపింది. కేవలం డబ్బు పిచ్చితోనే ఆమె అంతకుముందు ఉన్న భర్తకు, నాకు విడాకులు ఇచ్చింది. నరేష్ కు ఈ విషయం అర్ధం కావట్లేదు. ఆమె పచ్చి అవకాశవాది. త్వరలోనే నరేష్ ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments