Site icon NTV Telugu

Pavitra Lokesh: బ్రేకింగ్.. పోలీస్ స్టేషన్ లో పవిత్ర.. వారిపై ఫిర్యాదు

Pavitra

Pavitra

Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్నిరోజుల నుంచి నరేష్, పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి ట్రోల్స్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలివాన గా మారి ఒక హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర దొరికేవరకు వచ్చింది.

ఇక ఈ ఘటన తరువాత కూడా వీరు కలిసే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల్లో ఈ జంటనే హైలైట్ అయ్యింది. దీంతో వారిపైనే మరోసారి మీడియా విరుచుకుపడింది. నరేష్- పవిత్ర లోకేష్ ల గురించి యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్లు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చడంతో పవిత్ర సీరియస్ అయ్యింది. నేడు సైబర్ క్రైమ్ లో ఆమె ఫిర్యాదు చేస్తూ.. కొంతమంది టీవీ ఛానెల్స్, యూట్యూబర్స్ తమను టార్గెట్ గా చేసుకొని అభ్యంతరకర కామెంట్స్ తో పాటు తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని తెలిపింది. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తెలుపుతూ కొన్ని లింక్స్ ను కూడా పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

Exit mobile version