Site icon NTV Telugu

Pathaan Controversy: ఆలు లేదు చూలు లేదు.. అంతా తుస్!

Pathaan Postpone Clarity

Pathaan Postpone Clarity

Pathaan Unit Thrashes Those Rumours: ‘బేషరమ్ రంగ్’ పాట పఠాన్ సినిమాను వివాదాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే! అందులో దీపికా పదుకొణె కాషాయం రంగులో వేసుకున్న బికినీనే అందుకు కారణం. దీనిపై హిందూ సంఘాల దగ్గర నుంచి రాజకీయ నేతల దాకా.. అందరూ తీవ్రంగా స్పందించారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని.. లేకపోతే సినిమానే బ్యాన్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై నానా రాద్ధాంతం జరుగుతూనే ఉంది.

Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

ఈ నేపథ్యంలోనే పఠాన్ సినిమాపై ఒక గాసిప్ గుప్పుమంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కాబట్టి.. ఆయా సీన్లను తొలగించాలని సీబీఎఫ్‌సీ కండీషన్స్ పెట్టిందని ప్రచారం జరిగింది. అంతేకాదు.. టైటిల్‌ని కూడా మార్చాలని సూచించినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో తనని తాను గొప్ప క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ కూడా ఈ సినిమా వాయిదా పడనుందని ట్వీట్ చేయడం, టైటిల్ కూడా మారుస్తారని చెప్పడంతో.. బహుశా నిజమే అయ్యుండొచ్చని అంతా అనుకున్నారు. ఎలాగో ఈ చిత్రంపై తారాస్థాయిలో వ్యతిరేకత నెలకొంది కాబట్టి, పఠాన్ సినిమా కచ్ఛితంగా మార్పులు చేసి ఉండొచ్చని జనాలు భావించారు.

Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో.. పాపం అబ్దుల్

అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ చిత్రబృందం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తమ సినిమా ట్రైలర్‌ని ఈనెల 10న విడుదల చేస్తున్నామని పేర్కొన్న చిత్రబృందం.. టైటిల్ మార్చడం లేదని, సినిమాని కూడా వాయిదా వేయడం లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన జనవరి 25వ తేదీనే తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. చూస్తుంటే.. ఏ సన్నివేశాలపై అయితే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో, వాటిని కూడా చిత్రబృందం తొలగించలేదని తెలుస్తోంది. మరి, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల్ని యూనిట్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

Madrasa teacher: మదర్సాలో కీచక టీచర్.. విద్యార్థుల అసభ్యకర వీడియోలు తీసి..

Exit mobile version