Site icon NTV Telugu

Upasana Konidela: ఉపాసన సీమంతం.. రంగరంగ వైభవమే

Upasana

Upasana

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పదేళ్ల తరువాత అభిమానులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ను తెలిపాడు. తన భార్య ఉపాసన గర్భవతి అని, త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు ప్రకటించడంతో.. మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు అయితే తన వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఇక చరణ్, తన భార్యను అస్సలు వదిలిపెట్టడం లేదు. ఎక్కడకు వెళ్లినా ఉపాసన ఉండాల్సిందే. ప్రస్తుతం ఉపాసనకు 7వ నెల. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం చేశారు. అది మన దేశంలో కాదు దుబాయ్ లో. బీచ్ ఒడ్డున ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఉపాసన కుటుంబం సభ్యులు, చరణ్- ఉపాసన స్నేహితులు పాల్గొన్నారు.

Salaar 2: ఎన్టీఆర్ 31 వెనక్కి సలార్ 2 ముందుకి… ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్

చరణ్- ఉపాసన ఇద్దరు వైట్ అండ్ వైట్ డ్రెస్ ల్లో మెరిపించారు. వారిద్దరిని కూర్చోపెట్టి సంప్రదాయబద్ధంగా పూలు, పండ్లు ఇచ్చి ఈ సీమంతం చేసినట్ల తెలుస్తోంది. అనంతరం వారితో కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ.. ” ఈ ప్రేమకు మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం.. థాంక్యూ సిస్టర్స్” అని చెప్పుకొచ్చింది. అంటే ఇది కేవలం ఉపాసన కజిన్స్ సీమంతం మాత్రమే.. ఇండియాలో అత్తగారు సురేఖ ఆధ్వర్యంలో మరో సీమంతం ఉండనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా చరణ్.. బీచ్ ఒడ్డున భార్య ఉపాసనను ముద్దాడుతున్న ఫోటోలు అయితే అద్భుతమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version